పాలకుర్తి: జూలై 29 : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయితీలో గల రజ్వీకాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుట్టపైనుండి వస్తున్న వర్షపునీరు కాలనీలోకి రావడం వలన సరైన డ్రౖనేజీలు లేక కాలనీలో ఎక్కడి నీరు అక్కడే నిలుస్తున్నాయి. కాలనీ లోతట్టు ప్రాంతం అవడంవలన రాజీవ్ రహదారి పైనుండి వస్తున్న వర్షపు నీరుకుడా కాలనీలోకి ప్రవహిస్తుడటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
దీనికి తోడు కొందరు అక్రమంగా ప్రహరీ నిర్మించడంతో సమస్య మరింత తీవ్రమవుతున్నది. నీరు నిలిచి ఉండటం వలన దోమలు, ఈగలు వృద్డి చెంది కాలనీ వాసులు విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కాలనీవాసులు కోరుతున్నారు.