Jagtial | చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలి.. జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ పూర్ మండల కేంద్రం, నరసింహుల పల్లి గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం పరిశీలించారు.
- వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలి
- మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లో అన్లోడింగ్ చేయాలి
Jagtial | జగిత్యాల/సారంగాపూర్, జూన్ 11 : చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ పూర్ మండల కేంద్రం, నరసింహుల పల్లి గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ, ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు విక్రయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అకాల వర్షాలు ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసి వెను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. వర్షాలకు కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, సివిల్ సప్లై అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

