మన కన్నారంలో ప్రాపర్టీ షో
ఇండ్లు, ప్లాట్లు, లేదా విల్లాలు, ఇంటి స్థలాలు కొనాలనుకుంటున్నారా..? బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా..?
- ఈ నెల 26, 27 తేదీల్లో రెవెన్యూ గార్డెన్స్ వేదికగా ఏర్పాటు
- పాల్గొననున్న హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రియల్ సంస్థలు
- అందరికీ ఉచిత ప్రవేశం
- నిర్మాణరంగం గురించి తెలుసుకునే అవకాశం
ఇండ్లు, ప్లాట్లు, లేదా విల్లాలు, ఇంటి స్థలాలు కొనాలనుకుంటున్నారా..? బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా..? ఇందుకు సంబంధించిన సమాచారమంతా ఒకే వేదికపై తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకిదే మంచి అవకాశం! నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహించే ప్రాపర్టీ షోకు తరలిరండి! హైదరాబాద్, కరీంనగర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సంస్థలు, పలు బ్యాంకులు పాల్గొంటున్న ఈ ప్రాపర్టీ షోలో మీకు అవసరమైన సమాచారమే కాదు, నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త మార్పుల గురించి తెలుసుకోండి! ప్రవేశం ఉచితమే!
– కార్పొరేషన్, నవంబర్ 23
ఇండ్లు, అపార్ట్మెంట్లు, లేదా విల్లాలు, ప్రభుత్వ సంస్థలతో ఆమోదించబడిన స్థలాలు కొనాలనుకుంటున్నారా..? ఇందుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే గృహాల కొనుగోలు, బ్యాంకు లోన్ వివరాలు కావాలనుకుంటున్నారా..? ఇటువంటి సమాచారమంతా ఒకే వేదికపైన దొరికితే ఎంత బాగుండో అనుకుంటున్నారా..? అయితే మీకిదే అవకాశం! నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్లో ప్రాపర్టీ షో జరగనున్నది.
స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ ప్రాపర్టీ షోలో హైదరాబాద్, కరీంనగర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సంస్థలు పాల్గొనబోతున్నాయి. అలాగే రుణ సౌకర్యం కల్పించే పలు బ్యాంకులు కూడా పాల్గొననున్నాయి. ఉచిత ప్రవేశం ఉండే ఈ ప్రాపర్టీషో రెండు రోజులపాటు జరగనుండగా, ఇక్కడికి వస్తే నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త మార్పులను తెలుసుకోవచ్చు! అనేక ఆసక్తికర విషయాలూ నోట్ చేసుకోవచ్చు! మరెందుకాలస్యం.. 26, 27 తేదీల్లో ప్రాపర్టీ షోకు వచ్చేయండి!
ఈ ప్రాపర్టీ షోకు మెయిన్ స్పాన్సర్లుగా పీ మంగాత్రం, అపర్ణ, హైదరాబాద్ కంపెనీలు, అసోసియేట్ స్పాన్సర్‌గా రాయిచందని సింధ్ డెవలపర్స్, కో స్పాన్సర్లుగా ఆదర్శ కంఫర్ట్స్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, స్పాన్సర్లుగా ఉస్మాని కన్స్ట్రక్షన్స్, మైత్రి గ్రూప్స్, రాయల్ రిడ్జ్, డ్యూరో, రెప్కో హోమ్లోన్స్, శ్రీ వెంకటేశ్వర అవెన్యూ, కేకే ఎంటర్ ప్రైజెస్, బ్యాంకులు ఎస్బీఐ, యూబీఐ, బీవోబీ, కేడీసీసీబీ కొనసాగుతున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

