Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
Mission Bhagiratha Water | ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడంపై కొండాపూర్ గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Mission bhagiratha water | చిగురుమామిడి, అక్టోబర్ 28: కాంగ్రెస్ సర్కార్ పాలనలో అధికారులు నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నిర్వాహణ పనులను గాలికొదిలేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ బస్టాండ్ చౌరస్తా నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో గత నాలుగు రోజులుగా తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్‌లైన్ పగిలిపోవడంతో గంగిరెద్దుల కాలనీ, బీసీ కాలనీకి వెళ్లాల్సిన మిషన్ భగీరథ తాగునీరు తక్కువ సరఫరా అవుతోందని సమీప మహిళలు తెలిపారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, గంగిరెద్దుల కాలనీకి పూర్తిస్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా రోడ్డుపై వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీటిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జలజను వివరణ కోరగా సంబంధిత గ్రిడ్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

