Beedi workers | 12 నెలలుగా వేతనాల్లేవు.. పండుగ వేళ బీడీ కార్మికుల పస్తులు
ఏడాది కాలంగా బీడీలు చుట్టి పనిచేసినా కూలీ డబ్బులు అందకపోవడం, పండుగ వేళ పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేని దుస్థితి. ఇదీ ఠాగూర్ సౌదేకర్ బీడీ కంపెనీ కార్మికుల పరిస్థితి అని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ముషం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
- ఠాగూర్ సౌదేకర్ బీడీ కంపెనీ యాజమాన్యంపై ముషం రమేష్ ఆగ్రహం
- రెండు రోజుల్లో వేతనాలు చెల్లించాలి.. లేదంటే యజమాని ఇంటి ముందు ధర్నా
Beedi workers | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 13 : ఏడాది కాలంగా బీడీలు చుట్టి పనిచేసినా కూలీ డబ్బులు అందకపోవడం, పండుగ వేళ పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేని దుస్థితి. ఇదీ ఠాగూర్ సౌదేకర్ బీడీ కంపెనీ కార్మికుల పరిస్థితి అని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ముషం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని, పండుగ పూట కూడా పస్తులుండే పరిస్థితిని కల్పించడం అన్యాయమని ఆయన విమర్శించారు. సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముషం రమేష్ మాట్లాడుతూ రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవించే బీడీ కార్మికులకు నెలల తరబడి కూలి డబ్బులు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు.
కార్మికుల ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా వేతనాలు పెండింగ్‌లో పెట్టడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. దసరా పండుగకు పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వాలన్నా చేతిలో డబ్బుల్లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన 12 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని, యాజమాన్యం రెండు రోజుల్లో స్పందించి బకాయిలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దసరాలోపు వేతనాలు చెల్లించకపోతే హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పాటు కంపెనీ యజమాని ఇంటి ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని, ఇప్పటికైనా స్పందించి బకాయిలు చెల్లించి కార్మిక కుటుంబాలకు పండుగ పూట ఉపశమనం కల్పించాలని ముషం రమేష్ కోరారు. ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూరం పద్మ, జిల్లా ఉపాధ్యక్షుడు జిందం కమలాకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

