Municipal | కోరుట్లలో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన తినుబండారాల ప్యాకెట్లు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు.
- నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు రూ.10,500 జరిమానా
- నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
Municipal | కోరుట్ల, మే 31: పట్టణంలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆదేశాలతో అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన తినుబండారాల ప్యాకెట్లు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు.
అపరిశుభ్రతమైన వాతావరణంలో తినుబండారాలు విక్రయిస్తున్న షాపు యజమానులకు రూ. 10 వేల 500 జరిమానా విధించారు. రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించాలని, నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు వడ్డిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, వినియోగిస్తే భారీ జరిమానాలు, షాపులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారులు షాపుల నుంచి వెలువడిన తడి, పొడి, హానికారక చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని సూచించారు.
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెకర్లు రాజేంద్రప్రసాద్, బాలె అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్, మున్సిపల్ సిబ్బంది హేమంత్, జవాన్లు రమేష్, రాజ్ కుమార్,, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

