హైదరాబాద్ చేరిన కాంగ్రెస్ పంచాయితీ
కాంగ్రెస్‌లో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికతో మొదలైన పంచాయితీ మంగళవారం హైదరాబాద్‌కు చేరింది.
- సోమవారం అర్ధరాత్రి పట్నంవెళ్లిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
- అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం చేరవేత
- రంగంలోకి డిప్యూటీ సీఎం భట్టి, కేసీ వేణుగోపాల్
- అయినా రాజీనామావైపే అడుగు
- రేవంత్‌రెడ్డి తీరుపై భగ్గుమంటున్న పార్టీ శ్రేణులు
- ఉమ్మడి జిల్లాలోని కీలక నాయకులు, సంజయ్ కుట్రవల్లే అన్యాయం జరిగిందంటున్న శ్రేణులు
కాంగ్రెస్‌లో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికతో మొదలైన పంచాయితీ మంగళవారం హైదరాబాద్‌కు చేరింది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మాటైనా చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి తన సమక్షంలో చేర్చుకోవడంతో చిచ్చు రాజుకున్నది. ఓవైపు పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కాగా.. మరోవైపు జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధం కావడంతో అధిష్ఠానం బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ నచ్చజెప్పినా.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఫోన్లో ప్రయత్నించినా.. రాత్రి మంత్రి శ్రీధర్‌బాబు వచ్చి దౌత్యం చేసినా ససేమిరా అనడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
కాగా, అర్ధరాత్రి సమయంలో జీవన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. ఉప ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్‌బాబు, లక్ష్మణ్ కుమార్ అక్కడ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినా ఫలితం లేక వెనుదిరగాల్సి వచ్చింది. ‘మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది. సముచిత స్థానం కల్పిస్తుంది’ అన్న మంత్రుల మాటలను ఖండించడమే కాదు, ప్రభుత్వ హామీలపై పనిచేయకుండా.. ప్రజలకు సేవ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వస్తున్నదంటూ దుమ్ముదులిపినట్టు తెలిసింది.
జగిత్యాల, జూన్ 25, (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ చేరికతో రాజీనామాకు సిద్ధమైన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సోమవారం పొద్దంతా ఎవరు వచ్చి బుజ్జగించినా ససేమిరా అన్నారు. చివరకు అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేస్తానని ప్రకటించిన విషయం మీడియాలో రావడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, లక్ష్మణ్ కుమార్ తదితరులు రంగంలోకి దిగారు. మంగళవారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉన్న జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ‘మీ సేవలను పార్టీ గుర్తిస్తుంది. సముచిత స్థానం ఇస్తుంది’ అన్న మంత్రుల మాటలను జీవన్‌రెడ్డి ఖండించినట్టు సమాచారం.
‘సీనియారిటీ, సిన్సియార్టీకి విలువలేని చోట ఉండడం వ్యర్థం. ఇదేం పద్ధతి? కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ఇటు రాజీనామా లేఖ అందిస్తానని ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం అసెంబ్లీలో కార్యదర్శిని అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో మాట్లాడుతున్న సమయంలోనే.. ‘రాజీనామా పత్రం ఇవ్వడానికి వస్తున్నా. అందుబాటులో ఉండండి’ అని సెక్రెటరీకి జీవన్‌రెడ్డి ఫోన్లో చెప్పేందుకు యత్నించినా స్పందించనట్టు సమాచారం.
ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి, ఏఐసీసీ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌తో ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోన్లో మాట్లాడించిన సమయంలోనూ జీవన్‌రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తొందర పడొద్దని, సముచిత స్థానం ఉంటుందని వేణుగోపాల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెద్దగా స్పందించలేదని తెలిసింది. కాగా, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయిన తర్వాత తన కోసం జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కార్యకర్తలు, నాయకులతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.
రేవంత్‌రెడ్డి తీరుపై అసంతృప్తి!
సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై సోమవా రం వరకు పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి, మంగళవారం హైదరాబాద్ వేదికగా బాహాటంగానే మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి, ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌తో మాట్లాడుతూ, ‘పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు? ఇదేం పద్ధతి? ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఆప ద ఏం లేదు కదా..? అని ప్రశ్నించినట్టు సమాచారం. ‘64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన్రు. ఒక సీపీఐ ఎమ్మెల్యే మద్దతు ఉంది. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం సైతం మద్దతుగా వచ్చే అవకాశమున్నది. ఈ లెక్కన 73 మంది ఎమ్మెల్యేల మ ద్దతు ఏర్పడుతుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వస్తున్నది? ప్రభుత్వ హామీలపై పనిచేయకుండా, ప్రజలకు సేవ చేయకుండా, ఇదేం వ్యవహారం?’ అంటూ దుమ్ముదులపడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి వ్య వహారశైలిని సైతం ఎండగట్టినట్టు సమాచారం.
వ్యతిరేకంగా పనిచేస్తారా? : జీవన్ రెడ్డి
జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, రాహుల్‌గాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ సూత్రాలకు విరుద్ధంగా రేవంత్‌రెడ్డి వ్యవహరించడం సరికాదని నేరుగానే స్పష్టం చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించే వ్యవ స్థ సరికాదని భావించే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు. ఈ చట్టంలోని కొన్ని లోపాల ఆధారంగా పార్టీ ఫిరాయింపులను సరిగా అడ్డుకోలేకపోతున్నామని, ఇది రాహుల్‌గాంధీ నేతృత్వంలో ని కాంగ్రెస్ పార్టీ భావించిందని చెప్పారు. ఈ చ ట్టానికి సవరణ తెచ్చి మరింత పకడ్బందీగా రూ పొందించాలని రాహుల్‌గాంధీ భావించి, కాంగ్రె స్ పాంచ్ న్యాయ్ సూత్రాల్లో ఒకటిగా దీన్ని చేర్చిన విషయం అందరు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాహుల్‌గాంధీ ప్రతిపాదించిన పాంచ్ న్యాయసూత్రాలకు, పార్టీ ఫిరాయింపు నిరోధక అంశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ, పార్టీ నాయకుడు వ్యవహరించడం సరికాదని సూచించారు.
ఈ పాపం సీఎం, జిల్లా మంత్రులదే!
‘జీవన్‌రెడ్డితోపాటు శ్రేణులను మనోవేదనకు గురి చేసిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నాయకులదే’ అంటూ జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు. జీవన్‌రెడ్డి పార్టీలో ఉన్నందున తమకు గుర్తింపు రావడం లేదని, ఆయనను పార్టీలో లేకుండా చేస్తేనే తమకు మేలు జరుగుతుందని ఉమ్మడి జిల్లాలోని కీలక పదవుల్లో కొందరు ప్ర జాప్రతినిధులు భావించారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీనికితోడు సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డితో ఎన్నటికైనా తనకు ఇబ్బందేనని రేవంత్‌రెడ్డి గ్రహించాడని, అందుకే సీఎం, ఇక్కడి నేతలు కలిసి పొగబెట్టి, సాగనంపే పథకం రచించారని ఆరోపించారు.
ఫిబ్రవరిలోనే జగిత్యాలకు చెందిన ఓ కీలక కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కొండగట్టు వద్ద జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో రహస్యంగా సమావేశమై, సీఎంను కలువాలని సూచించి, కథకు ఆజ్యం పోశాడని చెబుతున్నారు. సీఎంను కలిసిన తర్వాత పార్టీలో చేరవద్దని ఎమ్మెల్యేకు చెప్పిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఎంపీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని ఓడించిన తర్వాతే పార్టీలోకి రావాలని సూచించారని పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి, ముగ్గురు ఉమ్మడిజిల్లా ప్రజాప్రతినిధులు, జగిత్యాల ఎమ్మెల్యే కలిసి జీవన్‌రెడ్డి ఓటమికి వ్యూహం రచించారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. జీవన్‌రెడ్డితోపాటు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, నాయకులను ఏడిపిస్తున్న పాపం కచ్చితంగా తగిలి తీరుతుంద ని కార్యకర్తలు శాపనార్తాలు పెడుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

