మంత్రపురి గడ్డపై గులాబీ జెండా
మంత్రపురి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు గులాబీ పార్టీకి జైకొట్టారని తెలిపారు.
- బీఆర్ఎస్కే ఓటర్ల బ్రహ్మరథం
- మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
- కార్యకర్తలతో కలిసి పోలింగ్ సరళిపై ఆరా
మంథని, డిసెంబర్ 1: మంత్రపురి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు గులాబీ పార్టీకి జైకొట్టారని తెలిపారు. మంథని రాజగృహలో బల్దియా చైర్పర్సన్, తన సతీమణి పుట్ట శైలజతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. 288 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లోని ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత పార్టీ, తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు తాను ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ చేసిన అభివృద్ధి, పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా అందించిన సేవలు ఈ ఎన్నికల్లో ఎంతగానో కలిసి వచ్చాయని సూత్రీకరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

