కాంగ్రెస్ గెలిస్తే కల్లోలమే
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అల్లకల్లోల మవుతుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పథకాలు తెచ్చిందేవరో..అభివృద్ధి చేసిందేవరో ప్రజలు ఆలోచించాలని కోరారు.
- బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన
- తన హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి
- రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్
- 27వ డివిజన్లో ప్రజా ఆశీర్వాదయాత్ర
గోదావరిఖని, నవంబర్ 19: పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అల్లకల్లోల మవుతుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పథకాలు తెచ్చిందేవరో..అభివృద్ధి చేసిందేవరో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో ప్రజాఆశీర్వాదయాత్ర చేపట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఉదయం స్థానిక జేఎల్ఎన్ స్టేడియంలో వాకర్స్‌ను, క్రీడాకారులను కలిసి ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయాచోట్ల కోరుకంటి మాట్లాడుతూ 55 యేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోసపడ్డారన్నారు.
అప్పుడు రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందర ఆపద మొక్కులతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మితే నిండా మునగడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ కోసం 45 రోజులు జైలు జీవితం గడిపానన్నారు. గత ఎన్నికల్లో ఉద్యమకారుడిగా గుర్తించి ఎమ్మెల్యేగా పట్టం గట్టారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చానని చెప్పారు. జేఎల్ఎన్ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు సింగరేణి అధికారులతో మాట్లాడానని టెండర్ ప్రాసెస్‌లో ఉన్నట్లు తెలిపారు. 8వ కాలనీ స్టేడియంలో ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. క్రికెట్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం నెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పార్కులను, జిమ్ములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి నుంచి స్టేడియంలో షుగర్ వైద్య పరీక్షలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వల శిరీష, నాయకులు అచ్చ వేణు, ఆకుల సత్యనారాయణ, మహంకాళి బాబు, సర్వేశ్, మహేశ్, ప్రదీప్, ప్రభుదాస్, వెంకటేశ్, పటేల్, హనుమంతు, మల్లయ్య, మాదాసు రాంమ్మూర్తి, పీటీ స్వామి, కౌటం బాబు, దేవరాజ్, నాగభూషణం, శ్రీహరి, తోకల రమేశ్, మల్లేశ్, కళావతి ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

