కార్పొరేషన్/చొప్పదండి/తిమ్మాపూర్, ఫిబ్రవరి 1: గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, చొప్పదండి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్,
రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.