పేదింటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్
పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివర్ణించారు
- ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం
- ఎమ్మెల్యే చందర్
- రామగుండంలో బతుకమ్మ చీరెలు, పింఛన్ మంజూరు పత్రాల అందజేత
గోదావరిఖని, సెప్టెంబర్ 25: పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివర్ణించారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ 12, 13, 33, 34, 35వ డివిజన్లలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలు, మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేసి, మాట్లాడారు.
దసరా ముందు అందిస్తున్న ఆస రా పేదింటికి ఓ పండుగలా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా రైతుబంధు, రైతుబీమా పథకాలు లేవని కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు. అన్నివర్గాల సంక్షే మం కోసం నిత్యం శ్రమించే సీఎం కేసీఆర్ రు ణం తీర్చుకోవాలని, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఇక్కడ మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, రాకం లత దామోదర్, బొడ్డు రజిత రవీందర్, జంజర్ల మౌనిక, నాయకులు పర్లపల్లి రవి, కళావతి, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, కోటేశ్వర్, రంజిత్, శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

