బైబై గణేశా..
“జై బోలో గణేశ్ మహారాజ్ కీ” “గణపతి బప్పా మోరియా..” “జైజై వినాయకా” నినాదాలు.. డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు.. చిన్నారుల కేరింతల మధ్య జిల్లావాసులు గణనాథుడికి ఘనవీడ్కోలు పలికారు.
- గణనాథుడికి ఘన వీడ్కోలు
- అంబరాన్నంటిన వినాయక నిమజ్జన వేడుకలు
- ఊరూరా కనుల పండువగా శోభాయాత్రలు
- దారిపొడవునా నీరా‘జనం’
- డప్పుచప్పుళ్లు, నృత్యాల హోరు
- మార్మోగిన ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ..’ నినాదాలు
- పూజలు చేసిన అమాత్యులు, ఎమ్మెల్యేలు, అధికారులు
- కరీంనగర్లో శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి గంగుల
- ఆయాచోట్ల ఎమ్మెల్యేలు
“జై బోలో గణేశ్ మహారాజ్ కీ” “గణపతి బప్పా మోరియా..” “జైజై వినాయకా” నినాదాలు.. డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు.. చిన్నారుల కేరింతల మధ్య జిల్లావాసులు గణనాథుడికి ఘనవీడ్కోలు పలికారు. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడిని, బుధవారం విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో కనుల పండువలా ఊరేగించారు. దారిపొడవునా జనం నీరాజనం పట్టగా, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు. కరీంనగర్లో శోభాయాత్రను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించగా, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మానకొండూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని పూజలు చేశారు.
– కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 27

కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 27 : తొమ్మిది రోజులపాటు ఘనమైన పూజలు అందుకున్న గణేశుడికి బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో వినాయకుడి ప్రతిమలను ఉంచి డప్పు చప్పుళ్లు, యువతీయువకుల నృత్యాలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా కదిలారు. దారిపొడవునా మహారాష్ట్ర, పూణే నుంచి తెప్పించిన ప్రత్యేక బ్యాండ్‌మేళా చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలు చేశారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ.. గణపతి బొప్పా మోరియా..’ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్‌లోని విగ్రహాలను మానకొండూర్, కొత్తపల్లి చెరువులతోపాటు చింతకుంట కెనాల్ వద్ద.. మిగతా జిల్లాల్లో చెరువులతోపాటు గోదావరి నది, మానేరువాగులో నిమజ్జనం చేశారు. కరీంనగరంలోని పాతబజార్‌లో ఒకటో నంబర్ గణనాథుడి వద్ద మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు, సీపీ సుబ్బారాయుడు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.

అనంతరం టవర్ సర్కిల్ వద్ద మంత్రితోపాటు కలెక్టర్ బీ గోపి, సీపీ, మేయర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, నాయకులు, ఉత్సవ సమితి బాధ్యులు వేర్వేరుగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా గోగుల ప్రసాద్, సంగెం రాధాకృష్ణ బృందం ప్రదర్శనలు ఆకట్టుకోగా, నగరవాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రలను తిలకించారు. మానకొండూర్ పెద్ద చెరువు వద్ద ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెద్దపల్లిలోని మినీట్యాంక్‌బండ్ వద్ద కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు. గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శోభాయాత్రలకు స్వాగతం పలికారు. జగిత్యాల టవర్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ పాల్గొని నృత్యం చేశారు.






Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

