అర్థాకలితో ఎవరూ ఇబ్బంది పడొద్దు : మంత్రి గంగుల

కరీంనగర్ : రాష్ట్రంలో ఎవరూ అర్థాకలితో ఇబ్బంది పడొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్లో లాంఛనంగా ప్రారంభించారు. యూడీఐఎస్ఈలో నమోదైన 1,13,850 మందికి రూ. 2 వేల నగదుతో పాటు 13,715 రేషన్ షాపుల ద్వారా 3 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ బియ్యం పంపిణిని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..
కరోనా సంక్షోభంతో ప్రపంచం, భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు ప్రజలు, ఉద్యోగులని వారి మానాన వారిని వదిలేసి చేతులెత్తేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో సంక్షేమాన్ని కొనసాగించడమే కాక మానవతా ద్రుక్పథంతో మరింత సాయం చేస్తుందన్నారు. ప్రైవేట్ టీచర్లు, స్కూళ్ల సిబ్బందికి పాఠశాలలు పునఃప్రారంబించే వరకూ సాయాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నా, ఏ హైకోర్టు, ఇతర సంఘాలు డిమాండ్ చేయకున్నా మానవతా థృక్పదంతో అందరిని ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.
డాటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ చివరి వ్యక్తి వరకూ సాయం అందేలా సీఎం ఆదేశాల్ని పాటిస్తామని మంత్రి చెప్పారు. ప్రతీ ప్రైవేట్ టీచర్, సిబ్బంది ఆత్మగౌరవంతో బ్రతికేలా స్కూళ్లు ప్రారంభమయ్యేవరకూ ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 3027 మంది ఉద్యోగుల్ని గుర్తించి రూ. 2 వేల సాయం అందజేతతో పాటు 441 రేషన్ షాపుల ద్వారా 76 మెట్రిక్ టన్నుల బీపీటీ బియ్యం అందిస్తున్నామన్నారు.

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

