పెద్దపల్లి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పెద్దపల్లికి చెందిన మేఘన సాదుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి కుమార్తె మేఘన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నది.
జూనియర్ మహిళా టీం విభాగంలో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ సివిలియన్ కేటగిరీ ఇండివిడ్యువల్లో మేఘన రెండు కాంస్య పతకాలు, ఒక వెండి పతకం సాధించింది. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు మధ్యప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి విజయరాజే సింధియా పతకాలు అందజేసి అభినందించారు.