Collector B Satya Prasad | గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో ఈ నెల 30న పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
- కొండగట్టు నుంచి జేఎన్టీయూ వరకు పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
- హెలీప్యాడ్ ఆలయం అతిథిగృహం సమావేశ ప్రాంగణం స్టాళ్లు భోజన పరిసర ప్రాంతాల ఏర్పాట్ల తనిఖీ
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
- గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి క్షేత్ర. స్థాయిలో పరిశీలించిన కలెక్టర్
Collector B Satya Prasad | కొడిమ్యాల, నవంబర్ 26 : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో ఈ నెల 30న పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో గురువారం పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 30న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాకు చేరుకుని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారని అనంతరం జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ఈ నేపథ్యంలో పర్యటనలోని ప్రతీ అంశాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముందుగా గవర్నర్ చేరుకోనున్న హెలీప్యాడ్ ను పరిశీలించి అక్కడ చేపడుతున్న బ్యారికేడింగ్ భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. హెలీప్యాడ్ వద్ద అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే హెలీప్యాడ్ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం గవర్నర్ బస చేయనున్న అతిథిగృహాన్ని పరిశీలించారు. అక్కడ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించనున్న గౌరవ వందనం జాతీయ గీతం రాష్ట్ర గేయం ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
అతిథిగృహం పరిసరాల్లో పరిశుభ్రత, విద్యుత్ తాగునీరు భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేఎన్టీయూ కొండగట్టు అడ్మిన్ బ్లాక్ వద్ద గవర్నర్ పాల్గొననున్న సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వేదిక సీటింగ్ సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరా, ఇతర సాంకేతిక ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులు ఇతర ప్రముఖులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వివిధ స్టాళ్లను పరిశీలించి, మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, వారి జీవనోపాధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రతిబింబించేలా స్టాళ్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
గవర్నర్ స్టాళ్లను సందర్శించే సమయంలో మహిళా సంఘాల ప్రతినిధులు తమ కార్యకలాపాలు, విజయాలను వివరించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఇతర ప్రముఖులు, అధికారుల కోసం ఏర్పాటు చేయనున్న భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, వడ్డింపు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. జేఎన్టీయూ అడ్మిన్ బ్లాక్ సమీపంలో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీకి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించాలని, పోలీసు శాఖ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన జన సమీకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. హెలీప్యాడ్, అతిథిగృహం, ఆలయం, జేఎన్టీయూ పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విధులకు కేటాయించిన పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గవర్నర్ సమీక్షలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్, నిక్షయ్ మిత్ర కార్యక్రమం, అనీమియా ముక్త్ భారత్, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో రెవెన్యూ , పోలీస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
Dementia | డిమెన్షియా అంటే ఏమిటి.. మతిమరుపుకు, దీనికి ఏమిటి సంబంధం..?
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
Elon Musk | ప్రతి చిన్నారికి రెండు స్పేస్ ఎక్స్ షేర్లు.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

