నేడు సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయన వెంటే సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు రానున్నారు. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ లెవల్ కమిటీలతో సమావేశం కానున్నారు.
- సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల జనరల్ బాడీ సమావేశాలు
- హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై శ్రేణులకు దిశానిర్దేశం
- ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
రాజన్న సిరిసిల్ల, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయన వెంటే సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు రానున్నారు. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ లెవల్ కమిటీలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు ‘సర్’పై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వేములవాడలో మహారాజ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనుండగా, అందుకు జిల్లా నాయకులు అంతా సిద్ధం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో సుమారు 800 మంది కార్యకర్తలు.. సిరిసిల్ల నియోజకవర్గంలో 287 బూత్ కమిటీల్లో ప్రతి బూత్ కమిటీకి ఇద్దరు చొప్పున 574 మంది, 35 మంది సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.
సమావేశాల ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సభ్యత్వ నమోదు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిలు తుల ఉమ, గూడూరి ప్రవీణ్ ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట పార్టీ నాయకులు కందుల క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, కొండ కనకయ్య, ప్రేమ్చారి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Sircilla district
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

