KTR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీష్ రావు
KTR | కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేసి కిటికీల అద్ధాలు పగులగొట్టారని తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు.
KTR | కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేసి కిటికీల అద్ధాలు పగులగొట్టారని తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నాయకులు, కార్యకర్తల యోగక్షేమాల అడిగి తెలుసుకున్నారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే, ఆయన అనుచరులు దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

