Godavarikhani | కేసీఆర్ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం.. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న అలుగునూరులో దీక్షా దివస్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు.
- దీక్షా దివస్ సభకు ఇంటింటికీ ఆహ్వానాలు
- బొట్టు పెట్టి ఆహ్వానించిన మహిళలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి
Godavarikhani | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న అలుగునూరులో దీక్షా దివస్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. సభకు ప్రజలను ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ మహిళా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఆహ్వాన పత్రాలు అందజేస్తూ సభకు రావాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన స్ఫూర్తితోనే దీక్షా దివస్ సభకు ఆహ్వానాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని అన్నారు. ‘తెలంగాణ వచ్చుడా.. కేసీఆర్ సచ్చుడా’ అనే నినాదంతో చేపట్టిన దీక్ష యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. దీక్ష ప్రభావంతోనే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన వెలువడిందని గుర్తుచేశారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రతి సంవత్సరం దీక్షా దివస్ నిర్వహించడం ద్వారా అమరుల త్యాగాలను, ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకుంటున్నామని చందర్ పేర్కొన్నారు. ఈ నెల 29న కరీంనగర్ లోని అలుగునూరులో నిర్వహించే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

