Thimmapur | షాడో ఎమ్మెల్యే వల్లే కవ్వంపల్లికి మంత్రి పదవి పోయింది.. కాంగ్రెస్ మాజీ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి
మానకొండూరు నియోజకవర్గం లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వంగాల మురళీధర్ రెడ్డి ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గన్నేరువరం కు చెందిన యువజన సంఘాల నాయకుడు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 2 : మానకొండూరు నియోజకవర్గం లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వంగాల మురళీధర్ రెడ్డి ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గన్నేరువరం కు చెందిన యువజన సంఘాల నాయకుడు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ లో విలేకరుల సమావేశం నిర్వహించి పలు అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయి, ఎమ్మెల్యే బంధువులు కొట్టే స్థాయికి చేరిపోయిందని అన్నారు. దాడి జరిగిన ఘటనపై వార్తలు రాస్తే రాసిన వారిపై సత్యాన్వేషణ పేరుతో వార్తలు రాయిస్తున్నారని, తప్పు చేయకుంటే నేరుగా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాలని సవాల్ విసిరారు. మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి దుష్టశక్తుల మారాడని, కార్యకర్తలకు ఎమ్మెల్యేకు దూరం పెంచుతూ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడని మండిపడ్డారు.
తనకు నచ్చిన పని చేయని అధికారులైనా, కార్యకర్తలనైనా ఎమ్మెల్యేకు దూరం చేసి రక్షసానందం పొందుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురళీధర్ రెడ్డి అవినీతి చేయకపోతే అద్దెకు ఉండే ఏడాదిలోనే ఇంటిని ఎలా కొనుగోలు చేశామని ప్రశ్నించాడు. ఇసుక దందాలు, మట్టి దందాలు, రియల్ ఎస్టేట్ దంతాలు చేసి కోట్లు వెనకేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ముడుపులు తెస్తున్నావో అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. నియోజకవర్గంలో ఆయన వేధింపులు తట్టుకోలేక అనేకమంది వ్యాపారులు వ్యాపారాలు బంద్చేశారని ఆరోపించారు. మురళీధర్ రెడ్డి ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గుండ్లపల్లి రాజేందర్రెడ్డి కేసులో హైకోర్టు కండిషన్ బేలు ఇచ్చిందని, ఆ హైకోర్టు ఆర్డర్లను స్థానిక పోలీసులు పాటించలేదని, మురళీధర్ రెడ్డి వద్దకే పోలీసులు వెళ్లి సంతకాలు తీసుకున్నారని, అతను ఎవరని ఇంత ప్రాధాన్యమిస్తున్నారని ప్రశ్నించారు. మంచి పేరు ఉన్న ఎమ్మెల్యే పేరు పాడుచేస్తూ బ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎమ్మెల్యే కవంపల్లి తీరు మార్చుకోవాలని, ఆయనను పక్కన పెడితేనే నియోజకవర్గ మారుతుందని ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

