జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు
జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ మురళీధర్ శ్రీవాస్తవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 29 : జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ మురళీధర్ శ్రీవాస్తవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఖాళీ ఉండగా, వీటిని బీటెక్ సివిల్ పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 56 ఏళ్లకు మించకూడదని సూచించారు.
జనరల్ మేనేజర్ పోస్టులకు 1,23,100 నుంచి 2,15,900, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 78,800 నుంచి 2,09,200, మేనేజర్ పోస్టుకు 67,700 నుంచి 2,08,700 వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో nhai.gov.in అనే వెబ్సైట్లో సెప్టెంబర్ 23 వరకు, ఆఫ్లైన్లో డీజీఎం హెచ్ఆర్ అడ్మిన్, 3, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ప్లాట్నెంబర్ జీ.5, 6, సెక్టార్ 10, ద్వారక, కొత్త ఢిల్లీ-110075 అనే చిరునామాకు అక్టోబర్ 22 వరకు పంపవచ్చని స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

