Gangula Kamalakar | జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగించారని తెలిసిందే.
ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీసు ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు.
మా ప్రభుత్వంలో మా మీద అనేక మంది విమర్శలు చేశారు, కానీ ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టలేదని.. రైతుల సమస్యల గురించి ప్రశ్నిస్తే కూడా ఇంత కఠిన చర్యలు తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు ఇచ్చిన రిమూవల్ లెటర్ వెనక్కి తీసుకునే వరకు రీజినల్ మేనేజర్ ఆఫీసు ముందు బైఠాయిస్తామన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
మనం ఆ డ్రైవర్‌కు అండగా ఉండాలని ఎమ్మెల్యే గంగుల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒకవేళ సాయంత్రం వరకు కూడా డ్రైవర్ అశోక్‌ను మళ్లీ విధుల్లోకి తీసుకోకపోతే రేపు వంద శాతం జగిత్యాలకు పోతం. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
లేకపోతే ఆర్ఎం ఆఫీసు ముందు బైఠాయిస్తాం
మా ప్రభుత్వంలో మా మీద అనేక మంది విమర్శలు చేశారు, కానీ ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టలేదు
రైతుల సమస్యల గురించి ప్రశ్నిస్తే కూడా ఇంత కఠిన చర్యలు తీసుకుంటారా?
అతనికి ఇచ్చిన రిమూవల్… https://t.co/9aF2B7qZrK pic.twitter.com/gwLC8gMJlp
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026