Doctors | కోరుట్ల, జూలై 1: సమాజంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించి పునర్ జన్మ ప్రసాదించే వైద్యులు దైవ సమానులు అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ వైద్య దినోత్సవం (డాక్టర్స్ డే) ను పురస్కరించుకొని పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ ఐఎంఏ వైద్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్ర రాయ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు డాక్టర్ అనుప్ రావు, స్వీతీ, రేగొండ రాజేష్, ప్రియాంక, ముక్క ఇంద్రనీల్ ,గీత, రమేష్, జ్యోత్స్న, అన్వేష్, ఓడ్నాల నరేష్, అర్చన, క్లబ్ ప్రతినిధులు గుంటుక సురేష్ బాబు, ఆడెపు మధు, అల్లాడి ప్రవీణ్, పోతనీ ప్రవీణ్ కుమార్, మంచాల జగన్, పడాల నారాయణ గౌడ్, బైరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!