జేఎన్టీయూ హైదరాబాద్కు అనుబంధంగా జగిత్యాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు లభించింది. ఈ కాలేజీ కొండగట్టు దగ్గర నాచుపల్లిలో ఉంది. ఇప్పటికే ఈ కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు లభించింది. ఐఎస్వో సర్టిఫికేషన్ కూడా ఉంది. ఎన్ఐటీ వరంగల్లో ఈ కాలేజీకి ఎంవోయూ ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో తాజాగా న్యాక్ గుర్తింపు కూడా జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీకి దక్కింది. ఈ కాలేజీకి న్యాక్.. ఏ ప్లస్ గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపు ఐదేళ్ల వరకు ఉండనుంది.