పెరిగిన దిగుబడి.. మురిసిన రైతు

కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 18: కరీంనగర్ రూరల్ మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరికోత యంత్రాలు, ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 11,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి 12,900 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్ సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. కాగా, వానకాలంలో 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. యాసంగిలో 24,500 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చెర్లభూత్కూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
ఎటు చూసినా ధాన్యపు రాశులే
గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడంతో ఎటు చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20 శాతం కోతలు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు వరి కోయగానే సంబంధిత ఏఈవోల వద్ద పేరు నమోదు చేసుకొని, టోకెన్ తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కాగా, దుర్శేడ్ సింగిల్ విండో ఆధ్వర్యంలో దుర్శేడ్, చేగుర్తి, మొగ్దుంపూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ సింగిల్ విండో పరిధిలో బొమ్మకల్, చెర్లభూత్కూర్, తాహెర్ కొండాపూర్, ఫకీర్పేట, దుబ్బపల్లి, జూబ్లీనగర్, నగునూర్, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, కమాన్పూర్, నాగులమల్యాల, ఎలగందులలో, ఐకేపీ ఆధ్వర్యంలో బహ్దూర్ఖాన్పేట, చామనపల్లి, ఎలబోతారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల్లో తాగునీరు, శానిటైటర్, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచుతున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

