నేరాల ఛేదనను చాలెంజ్‌గా తీసుకోవాలి

రాంనగర్, మే 8 : క్రైం పార్టీ పోలీసులు నేరాలను ఛేదించడాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోన్ సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో క్రైం పార్టీ పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో కృషిచేస్తే ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చన్నారు. ప్రస్తుత ఎండకాలంలో దొంగతనా లు జరిగేందుకు ఆసారం ఉంటుందని, క్రైం పార్టీ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఇతర జిల్లాలకు చెందిన నేరాలు, నేరస్తులు పట్టుబడే విధానాలను పరిశీలించాలని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సైబర్ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుటా, మటా, పేకాట, వ్యభిచారం, నకిలీ విత్తనాలపై సమాచారం సేకరించాలని తెలిపారు. సమాచార వ్యవస్థను పెంపొందించుకోవడం ద్వారా నేరస్తుల కదలికలను పసిగట్టవచ్చని పేరొన్నారు. ప్రతి కేసును ఛేదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నిర్దేశించారు. విధి నిర్వహణలో సంతృప్తి చెందేలా సేవలందించాలని తెలిపారు. రివార్డులు, ఆవార్డుల ప్రకటనలో క్రైం బృందాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నేరస్థలంలో సాక్ష్యాధారాలు చెదరకుండా తీసుకు నే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేరస్థలంలో సాక్ష్యాధారాలు చెదిరిపోయినట్లయితే జరిగే నష్టాలను వివరించాలని తెలిపారు. రేయింబవళ్లు గస్తీని ముమ్మరం చేయనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

