బల్దియా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక
పారిశుధ్య కార్మికులు, నీటి సరఫరా సిబ్బందికి నిత్యావసర సరుకులు, పీపీఈ కిట్లు అందజేత
హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 26: బల్దియా కార్మికులు, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వంతోపాటు పురపాలక సంఘం ప్రాధాన్యం ఇస్తున్నదని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల పేర్కొన్నారు. సోమవారం పురపాలక సంఘం వద్ద సుమారు 200 మంది పారిశుధ్య కార్మికులు, నీటి సరఫరా సిబ్బందికి సబ్బులు, కొబ్బరి నూనె, గ్లౌజులు, పీపీఈ కిట్లు, టవల్స్, చీరెలు, బట్టలను కమిషనర్ ప్రసన్నరాణితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కార్మికులతో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామన్నారు. కరోనా వారియర్స్‌గా ముందుండి సేవలందిస్తున్న వారికి వైద్య, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అంటువ్యాధులను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు కొండల్‌రెడ్డి, నల్ల లక్ష్మి, మాసాడి స్వరూపాముత్యంరావు, హెల్త్ అసిస్టెంట్ రాజు, శానిటరి జవాన్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ప్రత్యేక పారిశుధ్య పనులు
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 26: హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పలు చోట్ల చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల, కమిషనర్ ప్రసన్నరాణి పనులను పర్యవేక్షించారు. కార్మికులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా 9వ వార్డు దమ్మక్కపేట పరిధిలోని ప్రధాన రహదారి వెంబడి చెత్తా చెదారాన్ని తొలగించారు. రోడ్లను బాగు చేశారు. 30వ వార్డులో పిచ్చి చెట్లు తొలగించి మురుగు కాలువలు శుభ్రం చేశారు. 12వ వార్డులోని ఇందిరానగర్ బీసీకాలనీలో, 22, 29, 30వ వార్డుల పరిధిలోని కాకతీయకాలనీ, గాంధీనగర్, విద్యానగర్‌లో మురుగు కాలువల్లో సిల్ట్ తొలగింపు, ఫాగింగ్ తదితర పనులు చేశారు. 11వ వార్డులోని ఇప్పల్‌నర్సింగాపూర్ ప్రధాన రహదారి వెంబడి ముళ్ల చెట్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. 25వ వార్డు పరిధిలోని మట్టిరోడ్డును బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేశారు. సబ్‌జైలు ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమంలో పలు వార్డుల కౌన్సిలర్లు ఎం కొండల్‌రెడ్డి, దండ శోభ, తొగరు సదానందం, వెన్నంపల్లి కిషన్, ముక్క రమేశ్, ఫైళ్ల వెంకట్‌రెడ్డి, తోట రాజేంద్రప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రమౌళి, టెక్నికల్ అధికారి సాంబరాజు, తదితర పారిశుధ్య జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

