నమ్మితే మోసపోతం
‘ఎన్నికలు రాగానే కొత్తబిచ్చగాళ్ల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలమీద పడుతున్నరు. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు. ఇంకా మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నరు. నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రజలు గమనించాలి.
- ప్రతిపక్షాలవి ఝూటా మాటలు
- అభివృద్ధి నిరోధకులకు డిపాజిట్లు కూడా దక్కొద్దు
- వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పాలి
- రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, అక్టోబర్11: ‘ఎన్నికలు రాగానే కొత్తబిచ్చగాళ్ల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలమీద పడుతున్నరు. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నరు. ఇంకా మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నరు. నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రజలు గమనించాలి. జాగ్రత్తగా ఉండాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ‘సీఎం కేసీఆర్ ఓట్ల కోసం అలోచించే నాయకుడు కాదు. పేదల సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు.
ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజల పాలిట దేవుడయ్యారు. ఈ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అదే అన్ని రంగాల్లో వెనుకంజలో ఉన్న దేశాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే తొమ్మిది పదేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టగలిగే సత్తా ఉంది’ అని కొనియాడారు. బుధవారం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని నృసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.
బూటకపు మాటలతో మోసం చేస్తరు
రాష్ట్రం ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్యపు ఆరోపణలు, బూటకపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అభివృద్ధి నిరోధకులకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవద్దని, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేసి గట్టిగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, రాష్ట్రంలో విద్యార్హతలను బట్టి 2లక్షల 21వేల ఉద్యోగాలను సృష్టించి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
ఐటీ రంగంలో ఒకప్పుడు బెంగుళూర్ నంబర్ వన్ అయితే ఈ రోజు మన హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ఒకప్పుడు పంజాబ్ నంబర్ వన్‌గా నిలిస్తే, ఇప్పుడు మన రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుభీమా, రైతుబంధు, దళిత బంధు పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని, తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దరిదాపులో కూడా లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధి పనులను ఎన్నికల సమయంలో ప్రజలకు వివరిస్తూ వారిని అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కరెంటు కష్టాలు, సాగు, తాగు నీటి గోసలు, బీటలువారిన బీడు భూములు, మొగులుకేసి రైతన్న చూపులు, కరువుకాటకాలేనని విమర్శించారు. రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు నీరందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు వెటకారంగా మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో రాష్ర్టాన్ని దేశంలో నంబర్‌వన్‌గా నిలిపారన్నారు.
బీఆర్ఎస్కు 100 సీట్లు పక్కా
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి గ్రామాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న పనులను గమనిస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా..? కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ రుణం ఎప్పుడు తీర్చుకుందామా..? అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్కు 95 నుంచి 100 సీట్లలో విజయం సాధించడం పక్కా. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలువబోతున్నారని’ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
దళిబంధుపై కాంగ్రెస్‌కు కండ్లమంట
దళితు అభ్యున్నతికి దళితబంధుకింద రూ.10లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. వచ్చే ఏడేండ్లలో ఈ పథకాన్ని రాష్ట్రంలోని 17లక్షల కుటుంబాలకు అందిస్తామన్నారు. గతేడాది రాష్ట్రంలోని 40వేల దళిత కుటుంబాలకు అందించామన్నారు. ఈ సారి 2లక్షల77వేల మంది కుటుంబాలకు అందిస్తున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు మాత్రమే సాయం ఇస్తుంటే ధర్మపురి నియోజకవర్గానికి అదనంగా మరో వెయ్యి మందికి ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులు కండ్లు మండించుకుంటున్నారని దుయ్యబట్టారు. దళితబంధును ఆపాలని ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. 2018లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల ఇబ్బంది అయిందని, వారికి 13,600 ఓట్లు పడ్డాయని, ఈసారి అలా జరుగకుండా నాయకులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు.
వచ్చే నెల 2న సీఎం సభను విజయవంతం చేయాలి
ధర్మపురిలో వచ్చే నెల 2న సీఎం కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని ప్రజాత్రినిధులు, నాయకులకు సూచించారు. కార్యకర్తలే రూపొందించిన “సీఎం కేసీఆర్ బాటలో ఇంటింటికీ ఈశ్వరన్న” కార్యక్రమాన్ని 5వ తేదీ నుంచి ప్రారంభించి, ఇంటింటికీ వెళ్లి పథకాలు, అభివృద్ధిని వివరించాలన్నారు. ఈ నెల 20లోపు మండల స్థాయి, గ్రామస్థాయి సమన్వయ సమావేశాలు పూర్తి చేసుకోవాలన్నారు.
ఇక గత నెల 4న ప్రారంభించిన ప్రజా ఆశీర్వాద యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, గ్రామగ్రామాన ప్రజలు నీరాజనం పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీలు చిట్టిబాలు, బాధినేని రాజమణి, లక్ష్మి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, సుధారాణి, రాజేందర్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

