నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అంతా సిద్ధం చేశారు.
- అంతా సిద్ధం చేసిన అధికారులు
జగిత్యాల విద్యానగర్, ఫిబ్రవరి 14 : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అంతా సిద్ధం చేశారు. మూడు విడుతల్లో జరిగే పరీక్షలకు అధికారులు జనరల్, వొకేషనల్‌తో కలిపి 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటికే ప్రయోగశాలలను సిద్ధం చేశారు. ఈ పరీక్షలు నాన్ జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డెక్)ను నియమించారు. ఇందులో కన్వీనర్‌గా ఇంటర్మీడియట్ విద్యా జిల్లా నోడల్ అధికారి, సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బొప్పరాతి నారాయణ, సభ్యులుగా మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఏ ఖాలిక్, మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు కొక్కుల గంగాధర్‌ను నియమించారు.
మొదటి విడుత పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు 18 సెంటర్లలో, రెండో విడుత ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు 15 సెంటర్లలో, మూడో విడుత ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు 15 సెంటర్లలో జరుగనున్నాయి. ప్రతిరోజూ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంత రం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు కొనసాగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, వొకేషనల్ విభాగాల్లో కలిపి 6,235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బైపీసీ నుంచి 1,664 మంది, ఎంపీసీ నుంచి 2,218 మంది, వొకేషనల్ ప్రథమ సంవత్సరం నుంచి 1,199 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 1,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే ఓటీపీ ఆధారంగా ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది.
విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ఇవ్వాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థికి విధిగా యాజమాన్యాలు ప్రాక్టికల్స్‌కు సంబంధించిన హాల్‌టికెట్ ఇవ్వాలి. ప్రతి పరీక్షా కేంద్రం కళాశాల వారీగా హాల్ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఏ కారణంతోనైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎవరైనా విద్యార్థులు ఇబ్బందికి గురైతే సెల్ : 7997994356 నెంబర్లో సంప్రదించవచ్చు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
-బొప్పరాతి నారాయణ, ఇంటర్మీడియట్ విద్యా జిల్లా నోడల్ అధికారి, జగిత్యాల
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

