Indiramma houses | పునాదులు దాటని ఇందిరమ్మ ఇండ్లు.. కరీంనగర్ జిల్లాలో 30 శాతమే పూర్తి
పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామన్న హామీ.. ఆచరణలో మాత్రం అంతులేని నిరీక్షణగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మూడేళ్లు కావస్తున్నా నిర్మాణాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతూ, ఆశించిన వేగంతో ముందుకెళ్లటం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
- 2,188 ఇండ్లు ముగ్గుకు కూడా నోచుకోలే..
- ఇంకా అసంపూర్తిగానే వేలాది నిర్మాణాలు
- రెండో విడతకు సిద్ధమవుతున్న సర్కారు..!
Indiramma houses | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 19 : పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామన్న హామీ.. ఆచరణలో మాత్రం అంతులేని నిరీక్షణగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మూడేళ్లు కావస్తున్నా నిర్మాణాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతూ, ఆశించిన వేగంతో ముందుకెళ్లటం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంజూరైన ఇళ్లలో పూర్తయినవి మూడో వంతు కూడా లేకపోవడం పథకం అమలులోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఓవైపు రెండో విడత ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా.. మరోవైపు మొదటి విడత లబ్ధిదారులు పునాదులు, గోడలు, స్లాబుల వద్దే నిలిచిపోయిన నిర్మాణాలను ఎప్పుడు పూర్తి చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సొంతింటి కలను కాగితాల్లో చూపించిన ప్రభుత్వం.. ఆ కలను నిజం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తోందా? లేదా అనే సందేహాలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 11,419 మందికిపైగా లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. దీంతో సొంతింటి కల నెరవేరుతుందని పేదలు ఆశపడ్డారు. కానీ ఆచరణలో నిర్మాణాల పురోగతి మాత్రం నిరాశాజనకంగానే కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి 9,231 ఇళ్లకు మార్కింగ్ చేయగా, 8,011 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో పూర్తయినవి కేవలం 3,222 ఇళ్లు మాత్రమే. మరో 3,236 ఇళ్లకు స్లాబులు పూర్తయ్యాయి. 497 ఇళ్లు రూఫ్ లెవల్లో, 1,056 ఇళ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయి. నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లు 2,188 ఉండటం పరిస్థితి తీవ్రాతకు అద్దం పడుతుందని చర్చ జిల్లాలో నడుస్తుండగా, మంజూరైన ఇళ్లలో పూర్తయినవి సుమారు 28 శాతమే కావడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్, ఇసుక, ఇటుకలు, స్టీల్ ధరలు పెరగడం, కూలీల కొరత, మేస్త్రీల ఖర్చులు భారంగా మారడంతో నిర్మాణాలు ముందుకు సాగటం లేదు. అప్పులు చేసి పనులు ప్రారంభించినా బిల్లులు సకాలంలో అందక లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తుది బిల్లుల మంజూరులో జాప్యం నిర్మాణాల పూర్తికి అడ్డంకిగా మారుతోందన్న విమర్శలున్నాయి. నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన ఇందిరమ్మ కమిటీలు, సంబంధిత యంత్రాంగం మరింత చొరవ చూపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపాలు, ఆర్థిక ఇబ్బందులు పథకం పురోగతిపై ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మొదటి విడత ఇళ్లే పూర్తికాని పరిస్థితుల్లో రెండో విడత మంజూరుతో కొత్త లక్ష్యాలు నిర్దేశించడం కంటే, ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో పూర్తి చేస్తాం: స్వామి, హౌసింగ్ పీడీ (ఇన్చార్జి)
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను పూర్తిచేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాము. గతంలో తుది బిల్లుల మంజూరులో కొంత జాప్యం జరిగినప్పటికి, ప్రస్తుతం పూర్తయిన ఇళ్లకు బిల్లులు మంజూరవుతున్నాయి. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

