Mulkanoor | దీక్షా దివస్ కు రావాలని ముల్కనూరులో ఇంటింటా బొట్టు పెట్టి ఆహ్వానం
ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య పిలుపునిచ్చారు.
Mulkanoor | చిగురుమామిడి, నవంబర్ 27 : ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య పిలుపునిచ్చారు. ముల్కనూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు నుదుట బొట్టు పెట్టి, ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను వివరిస్తూ, తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలు, దీక్ష యొక్క చారిత్రక నేపథ్యాన్ని మహిళలకు గుర్తు చేశారు. ప్రతీ మహిళ తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గ్రామంలోని మహిళలు సర్పంచ్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి, తప్పకుండా హాజరవుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాంబారి కొమురయ్య, వార్డు సభ్యులు వంగల రాం, జట్టి లత, విజయలక్ష్మి, గట్టు రేణుక తదితరులు పాల్గొన్నారు. అలుగునూరులో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, మహిళల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందని నాయకులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

