ప్రపంచంతో పోటీ పడండి
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఐకేరెడ్డితో కలిసి అమాత్యుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 36 మందికి గోల్డ్‌మెడల్స్, 576 మందికి పట్టాలు అందజేశారు.
- సత్తా ఉంటే.. మిమ్మల్ని ఆపేవారే లేరు..
- ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫలితాలు
- మేధస్సుకు పదును పెట్టండి.. ఉన్నత లక్ష్యాలు సాధించండి
- సాంకేతికతను అందుకోండి.. గ్లోబల్ లీడర్లుగా ఎదగండి
- కంపెనీలు స్థాపించండి.. పది మందికి ఉద్యోగాలు కల్పించండి
- ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్ పిలుపు
- యూనివర్సిటీ, బ్రాంచ్ టాపర్లకు గోల్డ్‌మెడల్స్, పట్టాల అందజేత
- విద్యార్థులకు ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, యూనిఫామ్స్..
- టీ-హబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫలితాలు వస్తాయని, నేడు కంప్యూటర్లే మానవ మేధస్సును అధ్యయనం చేస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు మొక్కుబడిగా డిగ్రీలు పూర్తి చేయకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఐకేరెడ్డితో కలిసి అమాత్యుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 36 మందికి గోల్డ్‌మెడల్స్, 576 మందికి పట్టాలు అందజేశారు. అంతకుముందు ట్రిపుల్ ఐటీ కాన్ఫరెన్స్హాల్లో ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులతో డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఒప్పందం (ఎంవోయూ) చేసుకోగా, త్వరలోనే మినీ టీహబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
కెనడాలో రూ.30 లక్షల ప్యాకేజీ

మా మమ్మీడాడీ హృదయ రాజు-సుగంధ. ఇద్దరు ప్రైవేట్ టీచింగ్ చేస్తరు. నన్ను, తమ్మున్ని కష్టపడి చదవించిన్రు. 2015లో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన. సిక్స్ ఇయర్స్ కష్టపడి చదివిన. కెనడా దేశానికి చెందిన ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా జాబ్ కొట్టిన. సంవత్సరానికి రూ.30 లక్షలు ప్యాకేజీ. ఫుల్ హ్యాపీ. నా తమ్ముడు సీఏ చేస్తున్నడు. నేను మంచి జాబ్ కొట్టడం వెనుక మమ్మీడాడీ, యూనివర్సిటీ లెక్చరర్స్ సపోర్ట్ ఉన్నది.
– సుమన్, పీహెచ్సీ బ్రాంచ్ టాపర్ (గోల్డ్‌మెడలిస్ట్), మహబూబాబాద్ జిల్లా.
మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 26వ తేదీన వచ్చా. అప్పుడు రెండు, మూడు నెలల్లో వస్తానని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ వచ్చా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి నేను సిద్ధం.
- అప్పుడు చెప్పినట్టే.. ఇప్పుడు 2,200 మందికి ల్యాప్‌టాప్‌లు.. పీ1, పీ2లో 1,500 మంది విద్యార్థులకు డెస్క్‌టాప్‌లు, యూనిఫామ్స్, షూస్ అందజేశాం. ఆడిటోరియంలో విద్యార్థులు కింద కూర్చోకుండా 800 సామర్థ్యమున్న ఫిక్స్డ్ కుర్చీలు ఏర్పాటు చేశాం.
- విద్యార్థినులకు క్రీడల శిక్షణకు ముగ్గురు మహిళా పీడీలను నియమించాం. వసతి గృహాల్లో వార్డెన్ల సంఖ్య పెంచాం. హెచ్వోడీలు, డీన్లను మార్చాం. 24 గంటలపాటు లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థినుల భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా మహిళా ఎస్ఐని నియమించాం.
భవిష్యత్ అంతా త్రీ-డీ దే..

ప్రస్తుతం ప్రపంచం మొత్తం త్రీ-డీ వైపు చూస్తున్నది. రాబోయే 20 ఏండ్లలో ఈ విధానం విస్తరిస్తుంది. త్రీ-డీ అంటే మొదటిది డిజిటలైజేషన్, రెండోది డీ కార్బొనైజేషన్, మూడోది డీ సెంట్రలైజేషన్. భవిష్యత్తులో అపారమైన అవకాశాలు అందించే ఈ త్రీ-డీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

