Bhimeswara Temple | భీమేశ్వర ఆలయంలో దళిత నేతకు పరాభవం.. ఫ్రొటోకాల్ పదవిలో ఉన్నా పక్కకు నెట్టేసిన అధికారి
వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న దళిత నేతకు పరాభవం ఎదురైంది. భీమేశ్వర ఆలయంలో రాజన్న ఆలయ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం హాజరయ్యారు.
- అధికారి తీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు నేత
- నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
Bhimeswara Temple | వేములవాడ, నవంబర్ 6 : వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రొటోకాల్ పరిధిలో ఉన్న దళిత నేతకు పరాభవం ఎదురైంది. భీమేశ్వర ఆలయంలో రాజన్న ఆలయ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గాయత్రీ దేవి ఆలయం వద్ద నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ప్రొటోకాల్ పరిధిలోని మున్సిపల్, ఏఎంసీ, కౌన్సిలర్లు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
అయితే కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆవిష్కరణ కార్యక్రమానికి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రోటోకాల్ పరిధిలోని నాయకుడిని అక్కడ విధుల్లో ఉన్న అధికారి పక్కకు నెట్టేశారు. అవాక్కయిన సదరు నేత అధికారి వెంటనే ఏం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీంతో మాట పెరగాగా అక్కడే ఉన్న మరో అధికారి సమస్యను తాత్కాలికంగా కార్యక్రమం ముగిసే వరకు సద్దుమణిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు సదరు అధికారి దళిత నేత పట్ల వ్యవహరించిన తీరుపై ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరు ఏ పదవిలో ఉన్నారో కూడా తెలియకుండా అధికారి స్థాయిలో ఎలా విధులు నిర్వహిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఒక దశలో తనకు జరిగిన అవమానానికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో వెంటనే సదరు కార్యాలయ ప్రధాన అధికారి కలగజేసుకొని జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరినట్లు తెలిసింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని కోరినట్లు సమాచారం.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

