వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హృద్య
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అచీవర్స్ స్కూల్‌కు చెందిన బోంపెల్లి హృద్య వండర్ కిడ్ కేటగిరీలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
హౌసింగ్‌బోర్డు కాలనీ, మే 26: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అచీవర్స్ స్కూల్‌కు చెందిన బోంపెల్లి హృద్య వండర్ కిడ్ కేటగిరీలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. కరీంనగర్ నక్షత్ర హో టల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అద్భుత జ్ఞాపకశక్తి ప్ర దర్శనలో నాలుగేళ్ల చిన్నారి హృద్య గుక్కతిప్పకుండా 15కు పైగా శ్లోకాలు, పద్యాలు, 50 దేశాల జాతీ య పతకాలు, గ్లోబ్, ప్రపంచ పటంలో వివిధ దేశాలను గుర్తించి, 15 దేవుళ్ల వాహనాల పేర్లను చెప్పి అందరిని అబ్బురపరిచింది.
ఫజిల్స్, బ్రెయిన్వీటా గేమ్, ఇండియా మ్యాప్ ఫజిల్‌ను అత్యంత వేగంగా పరిష్కరించింది. ఈ కార్యక్రమానికి జడ్జీలుగా హాజరైన ఇంటర్నేషనల్ వండర్ రికార్డు, ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, కోఆర్డినేటర్ డాక్టర్ వేణుకుమార్ చిన్నారి జ్ఞాపకశక్తి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మరెన్నో రికార్డులను సాధించాలని వారు కాంక్షించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

