Odela | ఓదెల, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఊర చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి శనివారం సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ మహిళలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం పాలకవర్గం బతుకమ్మ మెట్లు, ఘాట్ కట్టడానికి తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలకవర్గ సభ్యులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపతి శ్రీలత-ప్రవీణ్, వార్డ్ సభ్యులు గొర్ల శ్రీనివాస్, దూలం సదానందం, రాపెల్లి రాజయ్య ,చింతం విజయ-స్వామి, పెండం లక్ష్మీ-ఓదెలు, కొండ్ర లక్ష్మణ్ ,తోట ఉమా మహేశ్వరి, తీర్థాల శ్రీనివాస్, బుద్ధే కుమార్, నూతి శంకర్, మాట్లా కుమార్, బోడకుంట శివన్న, చెరుకు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.