Ponnam Prabhakar | ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు.
Ponnam Prabhakar | చిగురుమామిడి, మే12 : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు రావడంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాంటా పూర్తైన వెంటనే ధాన్యం సంచులు లారీలు, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనుకోని పరిస్థితుల్లో వర్షం సంభవిస్తే ధాన్యం తడువకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో ఉండాలన్నారు. రవాణా తరలింపులో ఇబ్బందులు లేకుండా ఎంవీఏ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున హమాలీలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇల్లు పూర్తయిన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొన్నారు.
మొదటి విడతగా నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు జూన్ లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ గూళ్ల రజిత రాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్, ఏఈఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

