మూలవాగును తోడేస్తున్నరు
కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మామిడిపల్లి మూలవాగులో ఇసుకను రీచ్‌ను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరమున్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి రెండుసార్లు (మంగళవారం, శనివారం) ఇసుకను తరలించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
- బావులు, బోర్లలో అడుగంటుతున్న భూగర్భజలాలు
- దాదాపు 200 ఎకరాలకు నీరందని దుస్థితి
- ఆగ్రహించిన గ్రామ రైతులు
- తవ్వకాలు అడ్డుకొని ఆందోళన
కోనరావుపేట, మే 18: కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మామిడిపల్లి మూలవాగులో ఇసుకను రీచ్‌ను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరమున్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి రెండుసార్లు (మంగళవారం, శనివారం) ఇసుకను తరలించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇదే అదనుగా భావించిన కొంత మంది ట్రాక్టర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు.
సర్కారు అనుమతిచ్చిన చోట కాకుండా ఇష్టమొచ్చిన ప్రాంతంలో ఇసుకను తవ్వుతున్నారు. దాంతో సమీప వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు వట్టిపోతున్నాయని రైతులు ఆగ్రహించారు. సుమారు 20 మందికిపైగా రైతులు శనివారం మామిడిపల్లి మూలవాగులో ఇసుక రీచ్ తవ్వకాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకొని అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకోగా, ‘ఇలాగేనా ఇసుక తవ్వేది’ అంటూ రైతులు నిలదీశారు.
ఇష్టమున్నట్లు ఇసుక తోడేస్తుంటే సాగు ఆగమైతున్నదని ధ్వజమెత్తారు. సుమారు 200 ఎకరాలకు నీరందడం లేదని, పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయని వాపోయారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో వానకాలంలో సమీపంలోని వ్యవసాయభూముల్లోకి వరద వస్తున్నదని, భూములు కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇసుక రీచ్‌లో వెంటనే తవ్వకాలు ఆపాలని, మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. చివరకు ఆర్ఐ రాజశేఖర్ జోక్యంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
మరోచోటుకు తీసుకుపోవాలి
ట్రాక్టరోళ్లు ప్రభుత్వం అనుమతిచ్చిన వద్ద కాకుండా ఇష్టమున్నచోట తవ్వుతున్నరు. వీళ్లు చేయవట్టి మా వ్యవసాయ బావుల్లో చుక్క నీరుంటలేదు. వానకాలంల అయితే వాగును ఆనుకొని ఉన్న మా భూముల్లోకి వరదచ్చి కోతపడుతున్నయి. ఎండల్ల నీళ్లు లేక, వానకాలంలో భూమి దెబ్బతిన చానా నష్టపోతున్నం. అధికారులు మా మీద దయచూపి ఇసుక రీచ్‌ను మరోచోటుకు తీసుకుపోవాలి.
– లోకుర్తి లింబయ్య, రైతు (మామిడిపల్లి)
ఇష్టమున్నట్టు తవ్వుతున్నరు
మాకు మూలవాగును అనుకొని వ్యవసాయ భూమి ఉంది. ట్రాక్టర్ వాళ్లు ఇష్టం వచ్చిన చోట ఇసుకను తవ్వుతున్నరు. దీంతో ఎండకాలంల మా బాయిల చుక్కనీరుంటలేదు. బోర్లల్ల కూడా నీళ్లు ఎల్లుతలేవు. ఈ ఇసుక రీచ్ చేయవట్టి మా పంటలన్నీ ఎండిపోతున్నయి. గతేడాది వాగు నీళ్లు ఊళ్లెకు కూడా వచ్చినయి. ప్రజలకు కూడా నష్టం కలిగించే ఇసుక రీచ్‌ను అధికారులు తొలగించాలి.
– లోకుర్తి శంకర్, రైతు (మామిడిపల్లి )
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

