Golden Nandi Award | చిగురుమామిడి, మార్చ్ 2 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ ఉత్తమ ఆప్టోమెట్రిస్ట్ గోల్డెన్ నంది అవార్డు-2026ను మాజీ కార్మిక శాఖ మంత్రి, నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా హైదరాబాద్లోని బిర్లా సెన్స్ మ్యూజియం, భాస్కర ఆడిటోరియంలో అవార్డు అందుకున్నారు.
మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. చాలా సంవత్సరాలుగా శ్రీనివాస్ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్లు కార్యక్రమాలు చేపట్టి మండలంలో ప్రజల మన్ననలను పొందారు. వీరికి అవార్డు రావడం పట్ల సర్పంచ్ అల్లెపు సంపత్, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, సింగల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.