Suspended | కోల్ సిటీ, ఏప్రిల్ 9 : పెద్దపల్లి జిల్లా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను సస్పెండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం సెక్టార్‌లోని అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న నాగమల్యాల స్వర్ణలత, తనపై అధికారుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ ప్రవర్తన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని ప్రాథమిక విచారణలో తేలిందని, ఉన్నతాధికారుల నివేదికలు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి సదరు అంగన్వాడీ టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ సస్సెన్షన్ ఆదేశాలు సదరు టీచర్‌పై పూర్తి స్థాయి విచారణ పూర్తై తదుపరి చర్యలు తీసుకునేంత వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణ తప్పినా కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.