Aitharajupalli సుల్తానాబాద్ రూరల్, మార్చి 9: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని ఐతరాజుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి దవాఖాన, లయన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఇందులో భాగంగా దాదాపు 150 మంది టెస్టులు చేసి, 32 మంది కి కంటి ఆపరేషన్ గురించి రేకుర్తి హాస్పిటల్కు బస్సులో తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎర్రబెల్లి సుధీర్ రావు, కోశాధికారి తమ్మనవేని సతీష్, వైస్ ప్రెసిడెంట్ పూసాల సాంబమూర్తి, లయన్ కన్న రమేష్, ఆడెపు సదానందం, ఉపసర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు గుడాల మారుతి, దాసరి రాజిరెడ్డి, గ్రామప్రజలు పాల్గొన్నారు.