తెలంగాణకు కాళేశ్వరమే జీవధార
తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలుస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను, కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలని కాంగ్రెసోళ్లు చేసిన కుట్రలను తట్టుకొని అది ఇప్పటికీ నిలబడి ఉందని చెప్పారు. కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- మేడిగడ్డపై అసత్య ప్రచారాలు చేసిన కాంగ్రెస్
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 22 : తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలుస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను, కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలని కాంగ్రెసోళ్లు చేసిన కుట్రలను తట్టుకొని అది ఇప్పటికీ నిలబడి ఉందని చెప్పారు. కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయిందని, కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ చానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయని, వాళ్ల కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెకుల వరద నీటి ప్రవాహాన్ని తట్టుకొని మేడిగడ్డ నిలబడిందని చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 8 లక్షల 20 వేల క్యూసెకుల వరద పోతున్నా చెక్కు చెదరలేదన్నారు. కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. బ్యారేజీకి, ఆనకట్టకు మధ్య తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎండకాలంలో ఏ బస్సులైతే వేసుకుని మీరూ, మీ సహచర మంత్రివర్గం కాళేశ్వరం కూల్చే యాత్రకు వెళ్లారో.. అదే మంత్రి వర్గం మళ్లీ అవే బస్సులేసుకొని నేడు సందర్శించాలని సూచించారు.
అబద్ధాలు చెప్పిన పాపానికి ఆ కాళేశ్వర గోదారమ్మ నీళ్లు నెత్తిన చల్లుకుని వస్తే కొద్దిలో కొద్దిగా పాప ప్రాయశ్చిత్తమైనా కలుగుతుందన్నారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్పై కోపంతో రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని హితవుపలికారు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోసి ఉంటే వేసవిలో పంటలు ఎండిపోయేవి కావని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదన్నారు. కేవలం కేసీఆర్ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసి రైతుల పంటలను ఎండబెట్టిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరమేనని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడుతామనడం వారి కర్మ అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో సీడబ్ల్యూసీ నీటి లభ్యత లేదని చెప్పిందని, వైఎస్ఆర్ కాలంలో తవ్విన కాల్వలకు అనుమతులు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. కేవలం వారి జేబులు నింపుకునేందుకు ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు వినియోగించుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు మాని వెంటనే మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

