Sircilla | వన సంరక్షణే ధ్యేయం.. రాజన్నసిరిసిల్ల డీఆర్వో ఫరాజ్ అహ్మద్
గుండారంలోని బొంగుల కింది తండాలో అటవీ భూముల్లో వేసిన గుడిసెలను డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో తొలగించారు. అటవీ భూమిలో ఉన్న గుడిసెలను శుక్రవారం తొలగిస్తూ ఆయన మాట్లాడారు. అటవీభూమి రక్షణకు అందరూ సహకరించాలని తెలిపారు.
- అడవిలోని గుడిసెలను తొలగించిన అధికారులు
Sircilla | ఎల్లారెడ్డిపేట, నవంబర్ 27 : గుండారంలోని బొంగుల కింది తండాలో అటవీ భూముల్లో వేసిన గుడిసెలను డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో తొలగించారు. అటవీ భూమిలో ఉన్న గుడిసెలను శుక్రవారం తొలగిస్తూ ఆయన మాట్లాడారు. అటవీభూమి రక్షణకు అందరూ సహకరించాలని తెలిపారు. అడవిని, అటవీ భూమిని డిస్టప్ చేయవద్దని హెచ్చరించారు. అటవీ భూమి కబ్జాకు, చెట్ట నరికివేతకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. గుడిసెలను తొలగించేటప్పుడు కొందరు తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము 20 ఏండ్ల నుంచి వేసిన గుడిసెల్లో కేవలం గొరెలు, మేకలు, పశువులను మాత్రమే ఉంచుతున్నామని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో ఇది వరకే 20 రోజుల ముందే అటవీ భూమిలో ఉన్న గుడిసెలు తొలగించాలని నోటీసులను కూడా అందించామని వారు స్పందించని కారణంగానే సిబ్బందితో గుడిసెలను తొలగించినట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ ఎఫ్‌బీవో జ్యోతినాయక్, కానిస్టేబుల్ అరుణ్, ఐదుగురు బేస్‌క్యాంపు సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

