Vijaya Ramana Rao | ఓదెల, ఆగస్టు 31 : పెద్దపెల్లి జిల్లా వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్ ల ఉద్యోగ సంఘం కార్యవర్గం సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావును కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సాధక, బాధలను వివరించి తమకు ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి ఇండ్ల రమేష్, వైస్ ప్రెసిడెంట్ గడ్డం శారద, సహాయ కార్యదర్శి మామిడిపల్లి సాగర్, ఏదుల రవి, ముఖ్య సలహాదారులు రెడ్డి నవీన్ కుమార్, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.