Road Accident | రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి.. దీపావళి వేళ కొండాపూర్లో తీరని విషాదం..
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తండ్రి, ఏడేళ్ల చిన్నారి కూతురు ప్రాణాలు కోల్పోగా, భార్య, కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Road Accident | చిగురుమామిడి, నవంబర్ 9 : దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తండ్రి, ఏడేళ్ల చిన్నారి కూతురు ప్రాణాలు కోల్పోగా, భార్య, కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పండుగ వేళ జరిగిన ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35) తన భార్య స్వాతి, కుమార్తె మహన్వి (మహిరి) (7), కుమారుడు శ్రీకాంత్ తో కలిసి దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని పందిళ్ల శివారులో వారి కారు ట్రాక్టర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకాంత్తో పాటు చిన్నారి మహన్వి (మహిరి) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న భార్య స్వాతి, కుమారుడు శ్రీహాన్ తీవ్రంగా గాయపడగా, మృతి చెందిన వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని కలుసుకోవాలన్న ఆశతో స్వగ్రామానికి వస్తున్న ఆ తండ్రి, తన గారాలపట్టి చిన్నారితో కలిసి విగతజీవులుగా మారడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. పండుగ వేళ ఇంటిల్లిపాది కలిసి ఆనందంగా గడపాల్సిన సమయంలో కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చిన్నారి చిరునవ్వులు, కుటుంబ సభ్యుల ఆనందంతో కళకళలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కొండాపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ మార్క రాజ్ కుమార్, ఉపసర్పంచ్ బింగి రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
మృతి పట్ల మంత్రి, మాజీ ఎమ్మెల్యే సంతాపం
రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతిచెందడంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. ఒకే కుటుంబంలో తండ్రి కూతురు మృతి కుటుంబంలో తీరని లోటని అన్నారు. అలాగే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కోరారు. ఇద్దరి మృతితో కొండాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

