పచ్చిరొట్ట కోసం పాట్లు
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ కనిపిస్తున్నాయి. క్యూలైన్లలో పాస్‌బుక్ జిరాక్సు పత్రాలు పెట్టి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు మళ్లీ అవస్థలు పడుతున్నారు.
- జనుము, జీలుగ విత్తనాల కోసం రైతుల తిప్పలు
- మల్యాల, గొల్లపల్లి మండలాల్లో అవస్థలు
- క్యూలైన్లలో పాస్‌బుక్ పత్రాల జిరాక్స్‌లు
- కొన్నిచోట్ల ఒక్కటే బస్తా.. మరికొన్ని చోట్ల రెండు బస్తాలు
- కొన్నిచోట్ల అవి కూడా దొరక్క వెనుదిరిగిన పలువురు రైతులు
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ కనిపిస్తున్నాయి. క్యూలైన్లలో పాస్‌బుక్ జిరాక్సు పత్రాలు పెట్టి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు మళ్లీ అవస్థలు పడుతున్నారు. ఒక్క పట్టాదార్ పాసుబుక్కుకు ఒక్కటి, కొన్ని చోట్ల రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో అవి ఏ మూలకు సరిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– మల్యాల/ గొల్లపల్లి, మే 27
మల్యాలలో క్యూ
మల్యాలతోపాటు మండలంలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్ పాయింట్లు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద ప్రభుత్వపరంగా రాయితీపై అందజేసే పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ బస్తాలు సోమవారం పంపిణీ చేయడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానంగా మల్యాల పీఏసీఎస్ వద్ద రైతుల పాసుపుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలో పెట్టారు. మల్యాల, నూకపల్లి, పోతారం సహకార సంఘాట వద్ద రైతులకు ఎరువుల బస్తాలు దొరక్క నిరాశగా తిరిగి వెళ్లారు. ఈ విషయమై మల్యాల ఏవో చంద్రదీపక్ను సంప్రదించగా.. మండలానికి అవసరమయ్యే జీలుగ, జనుము బస్తాల కోసం పెట్టిన ఇండెంట్లో కేవలం 50 శాతం మాత్రమే వచ్చాయని, మిగతా 50 శాతం బస్తాలు మరో మూడురోజుల్లో వస్తాయని, రాగానే రైతులకు పంపిణీ చేస్తామన్నారు.
గొల్లపల్లిలో ఒక్కటే బస్తా
గొల్లపల్లి మండల కేంద్రంలోని డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల ద్వారా సబ్సిడీపై జీలుగ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయగా, ఒక్కో కేంద్రానికి 834 (ఒక్కొక్కటి 30 కిలోలు) బస్తాలు మాత్రమే కేటాయించడంతో వాటి కోసం రైతులు ఎగబడ్డారు. మండలంలో 27 గ్రామాలుండగా పదివేల పైచిలుకు రైతులున్నారు. పట్టా పాస్బుక్కు ఒక్క బస్త్తానే ఇవ్వడంతో అవి సరిపోవని నిర్వాహకుడితో రైతులు వాదనకు దిగారు. ఐదెకరాలకు పైఆ ఉన్న వారికి ఒక్క బస్తా ఏమూలకు సరిపోతుందని మండిపడ్డారు. ఒక్క బస్తా కోసం ఒక్క రోజంతా కేంద్రాల వద్ద పడికాపులు కాయాల్సి వచ్చిందన్నారు. డీసీఎంఎస్ నిర్వాహకుడు రైతుల పాస్ బుక్‌ల జిరాక్స్ తీసుకుని పేర్లు పిలుస్తూ రైతుకు ఒక బస్తా చొప్పున అందించారు. మొదటి విడతగా వచ్చిన పచ్చిరొట్ట విత్తనాలు 20 శాతం మంది రైతులకు కూడా సరిపోకపోవడంతో మిగిలిన వారు నిరాశగా వెనుదిరిగారు.
మళ్లీ ఎప్పుడు వస్తయో తెల్వదు
వానకాలం పంట సీజన్లో ఎరువుల వాడకం తగ్గించేందుకు ఏటా జీలుగ చల్లుతం. ఏపుగా పెంచి, రొటవేటర్, కేజీవీల్స్ సాయంతో పొలం దున్నుకుని సారవంతం చేసుకుంటం. కానీ, పోతారం సహకార సంఘ పరిధిలో నాలుగు గ్రామాలు ఉంటే ప్రభుత్వం సబ్సిడీపై 100 మాత్రమే జీలుగ బస్తాలు పంపిణీ చేసింది. నాకు విత్తనాలు దొరుకలేదు. మళ్లీ వస్తాయని చెప్పిన్రు. మళ్లీ ఎప్పుడు వస్తయో తెల్వదు. గతంతో పోలిస్తే జీలుగ బస్తా ధర పెరిగింది. కొందరు జీలుగ చల్లుకుని సాగు చేసుకుంటే మేమోమో విత్తనాల కోసం ఎదురుచూసుడు అయితంది.
-గొట్టం నారాయణ, రైతు, రాంపూర్(మల్యాల)
జనుము బస్తాలు ఇస్తలేరు
సోమవారం నూకపల్లి సహకార సంఘ పరిధిలో కేవలం జీలుగ బస్తాలు మాత్రమే ఇచ్చిన్రు. మట్టి భూమికి జీలుగ, చెలుక పొలానికి జనుము విత్తనాల అలుకడం వల్ల భూములు సారవంతమవుతయి. ప్రభుత్వపరంగా జీలుగ బస్తాలు మాత్రమే ఇస్తున్నరు. జనుము బస్తాలు ఇస్తలేరు. వస్తాయంటున్నరు కానీ, ఎప్పుడు వస్తయో తెల్వదు. జీలుగ బస్తాల కోసం కొందరు రైతులు లైన్లో నిలబడినా దొరకకపోవడంతో వెనుదిరిగిన్రు. ఇప్పటికైనా రైతులకు సరిపడా జనుము, జీలుగ బస్తాలు అందించాలి. రోహిణీ కార్తెలోనే చల్లుకునేలా అధికారులు చొరవ చూపాలి.
– కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, రైతు, రామన్నపేట (మల్యాల)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- DCMS
- farmers
- seeds
- Vegetables
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

