మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ, మార్పును స్వాగతిస్తూ మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
- పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
- పర్యాటక కేంద్రంగా కరీంనగర్ సిటీ
- రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
- అల్ఫోర్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్లాష్‌మాబ్
- తీగల వంతెనపై ఆకట్టుకున్న ప్రదర్శనలు
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్10: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ, మార్పును స్వాగతిస్తూ మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. తీగల వంతెనపై ఆదివారం సాయంత్రం అల్ఫోర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణాన్ని రక్షించాలని ఫ్లాష్‌మాబ్ నిర్వహించగా, కార్యక్రమానికి మంత్రి గంగుల, మేయర్ వై సునీల్ రావుతో హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే నగర వాసుల్లో మార్పు మొదలైందని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతులు ప్రతిష్ఠించేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
అలాగే నగరం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, అది స్వరాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణ రాక ముందు కరీంనగర్‌కు వచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు ఆలోచించే వారని, కానీ ఇప్పుడు కోరి మరీ కరీంనగర్‌కు వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రివర్ ఫ్రంట్ పూర్తయితే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.
విదేశీయులు కూడా జిల్లాను సందర్శించాలనే నగరాన్ని తీర్చుదిద్దుతున్నామని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఇవన్నీ మాకోసం చేసుకుంటున్న పనులు కావనీ, మీ భవిష్యత్తు కోసం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన నరేందర్‌రెడ్డి, అల్ఫోర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

