Korukanti Chander | అట్టహాసంగా జిల్లాల దశాబ్ది సంబురాలు జయప్రదం చేయాలి.. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఆవిర్భవించి అక్టోబర్ 11 నాటికి పదేళ్లు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాల దశాబ్ది సంబురాలను అంబరాన్నంటేలా విజయవంతం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు
- కేసీఆర్ పాలనా సంస్కరణలతోనే ప్రజలకు చేరిన పరిపాలనా వికేంద్రీకరణ ఫలితాలు
- ఈ నెల 10, 11 తేదీల్లో రామగుండంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
- యువత, జేఏసీ నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారులను భాగస్వాములను చేయాలి
Korukanti Chander | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఆవిర్భవించి అక్టోబర్ 11 నాటికి పదేళ్లు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాల దశాబ్ది సంబురాలను అంబరాన్నంటేలా విజయవంతం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ పాలనా సౌలభ్యం కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలనను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, గతంలో చిన్న పనికి కూడా 100 నుండి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఉండేదని, నేడు నూతన జిల్లాల ఏర్పాటుతో ఆ దూర భారం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని గుర్తుచేశారు.
కేటీఆర్ సూచనల మేరకు రామగుండం నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కోరుకంటి చందర్ వివరించారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో యువతతో కలసి భారీ బైక్ ర్యాలీలు తీయాలని కోరారు. ఆకాశంలోకి రంగురంగుల బెలూన్లు ఎగురవేసి వేడుకలు జరపాలని, జిల్లా సాధన కోసం పోరాడిన జేఏసీ నాయకులు, ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని, బార్ అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలు, యువజన సంఘాలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. కేసీఆర్ సాధించిన ఈ చారిత్రక విజయాలను, పాలనా సంస్కరణల ఫలాలను ప్రజలకు గుర్తుచేయాల్సిన గురుతర బాధ్యత ప్రతీ గులాబీ సైనికుడిపై ఉందని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సంబురాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

