కరీంనగర్ కమాన్చౌరస్తా, జనవరి 31: విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు ఈ నెల 2న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఉపాధి కల్పనాధికారి కే దేవేందర్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యానఖపవర్ కం. లి.(టామామ్) శుక్రవారం కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నదని చెప్పారు.
ఇజ్రాయిల్లో నిర్మాణ కార్మికులు, షట్టరింగ్, కార్పెంటర్లు, సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ పనులు చేసేందుకు డిమాండ్ ఉన్నదన్నారు. అభ్యర్థులకు పదో తరగతి ఉత్తీర్ణులై, మూడేళ్ల అనుభవంతో 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఎంపికైన వారికి నెలకు 1.20 లక్షల నుంచి 1.30 లక్షల వరకు వేతనం ఉంటుందని చెప్పారు. మిగతా వివరాలకు 99854 83931లో సంప్రదించాలని సూచించారు.