Dharmapuri | ధర్మపురిలో ఘనంగా దీక్షా దివస్.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా ధర్మపురిలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Dharmapuri | ధర్మపురి, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా ధర్మపురిలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కూర్చుని దీక్షా దివస్‌ను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష కీలక ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమ పోరాటాన్ని స్మరించుకుంటూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు అయ్యోరి రాజేష్ కుమార్, బండారి రంజిత్ నాయకులు సంగీ శేఖర్, ఒడ్నాల మల్లేశం, చిలువేరి శ్యాంసుందర్, మహిపాల్ రెడ్డి, కాశెట్టీ విజయ్, రాజన్న, లక్ష్మణ్, చుక్క రవి, బాకీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- Dharmapuri
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

