అందని సాయం.. ఆగిన ఇంటి నిర్మాణం
పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్రకటించినా.. అది ఉత్తదేనని తెలుస్తున్నది.
- స్త్రీనిధి రుణం విడుదలకు కొర్రీలు
- ఏడు నెలలుగా బ్యాంకు ఖాతాలోనే మూలుగుతున్న రూ.లక్ష రుణం
- బేస్మెంట్ స్థాయిలోనే నిలిచిన ఇందిరమ్మ ఇల్లు
- అధికారుల చుట్టూ లబ్ధిదారురాలు ప్రదక్షిణలు
- కలెక్టర్ స్పందించాలని వేడుకోలు
కోనరావుపేట, జూన్ 26: పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్రకటించినా.. అది ఉత్తదేనని తెలుస్తున్నది. కోనరావుపేట మండ లం కొలనూరుకు చెందిన మెరుగు రజితకు రుణం బ్యాంకులో జమ అయి ఏడు నెలలవుతున్నా.. నేటికి విడుదల చేయకపోవడంతో ఇంటి నిర్మాణం ఆగిపోయింది. ఆ సాయం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరిగి తిరిగీ వేసారి పోతున్నది. బాధితుల కథనం ప్రకా రం.. కొలనూరుకు చెందిన మెరుగు వెంకటేశ్, రజిత దంపతులది నిరుపేద కుటుంబం.
వీరికి ముగ్గురు పిల్లలు. వెంకటేశ్ పేయింటర్గా, రజిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నది. చుట్టూ పరదాలు కట్టుకొని, వాటిపై రేకులు వేసుకొని అందులోనే నివసిస్తున్నారు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకున్న వీరికి గతేడాది మేలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకావడంతో సంబురపడ్డారు. కానీ, చేతిలో చిల్లిగవ్వలేక నిరాశ చెందారు. స్వశక్తి మహిళా సంఘ సభ్యురాలైన ఆమెకు ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి షరతులు లేకుండా స్త్రీ నిధి ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎలాగోలా చిన్న ఇల్లయినా కట్టుకుంటే భరోసా ఉంటుందని ముందడుగు వేశారు. బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. డబ్బుల్లేక ప్లింత్ బీమ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో బిల్లు రాలేదు. నిర్మాణం ఆగిపోయింది. ఇటు సం ఘం ద్వారా దరఖాస్తు చేసుకున్న రజితకు ఏడు నెలల క్రితమే లక్ష రుణం బ్యాంకు ఖాతాలో జమ అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ డబ్బు రాలేదని ఆమె ఆవేదన చెందుతున్నది. రుణం మంజూరు చేయించేందుకు మహిళా సంఘం వారు రూ.2,700 తీసుకున్నారని, తర్వాత బ్యాంకు, ఐకేపీ కార్యాలయాల చుట్టూ ఏడు నెలలుగా తిప్పిస్తున్నారని వాపోయింది.
తమతోపాటు మరికొందరు మహిళా సంఘ సభ్యుల పరిస్థితి కూడా ఇదేనని తెలిపింది. ఇప్పటికే ఇల్లు లేక డేరాలో ముగ్గురు చిన్నారులతో జీవనం సాగిస్తున్నామ ని, ఇటీవల రాత్రి తన భర్త వెంకటేశ్‌ను ఎలుక కరిచిందని ఆవేదన చెందింది. ఖాతాలో రుణం విడుదల చేయకుండానే వడ్డీ పేరిట రూ.8వేల వరకు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించింది. కలెక్టర్ మేడం స్పందించి తనకు న్యాయం చేయాలని, రుణం ఇప్పించి ఆదుకోవాలని రజిత వేడుకుంటున్నది. ఈ విషయమై ఏపీఎం రాజేశంను సంప్రదించగా, రజిత విషయం తమ దృష్టికి వచ్చిందని, క్షేత్ర స్థాయిలో పరిశీలించామని చెప్పారు. సిరిసిల్ల బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్ అధికారులతో మాట్లాడామని, సమావేశం ఏర్పాటు చేసి సమస్యను వెంటనే పరిషరిస్తామన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

