9 నెలల్లో 89 శాతం బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని భావిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముగిసిన 9నెలల కాలానికి సింగరేణి సంస్థ 52.99 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 47.22 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించింది
- వచ్చే 3 నెలల్లో 22.8 మిలియన్ టన్నుల లక్ష్యం
- గతేడాది కన్నా అధిక ఉత్పత్తి సాధించే దిశగా అడుగులు
గోదావరిఖని, జనవరి 1: సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని భావిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముగిసిన 9నెలల కాలానికి సింగరేణి సంస్థ 52.99 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 47.22 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇప్పటికే 5.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి వెనుకబడి ఉన్న సంస్థ, వచ్చే 3 నెలలు కీలకంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఒకే రోజు 2.53లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించిన సంస్థ జనవరి నుంచి మార్చి వరకు భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించడం ద్వారా అంతర్గతంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నది.
డిసెంబర్లో సంస్థ 73,50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకోగా, 67,29,861 టన్నులు (92శాతం) సాధ్యమైంది. ఒక నెలలోనే 6.7మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించిన క్రమంలో వచ్చే 3 నెలల్లో ఇదే స్థాయిలో జరిగితే 20మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశముంటుంది. ఈ 3 నెలల్లో నెలకు 7.4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే 3 నెలల్లోనే 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకుంటే సింగరేణి సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించిన ఘనత దక్కించుకుంటుంది. 9నెలల్లో సింగరేణి వ్యాప్తంగా జరిగిన బొగ్గు ఉత్పత్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Coal
- mine
- production
- Singareni
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

